Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

  • నాట్స్ కొత్త కార్యవర్గం

    ***నాట్స్ డెట్రాయిట్ కొత్త కార్యవర్గం***

    ***నాట్స్ లోకి స్థానిక తెలుగు ప్రముఖులు***

    నొవై: డెట్రాయిట్: అమెరికాలో తన పరిధిని క్రమంగా పెంచుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సోసైటీ నాట్స్ డెట్రాయిట్ లో మరింత బలపడుతోంది. 2014-15 సంవత్సరానికి డెట్రాయిట్ నాట్స్ కొత్త కార్యవర్గం ఏర్పాటయింది. నొవై సిటీ లో కొత్త కార్యవర్గం సమావేశమై భవిష్యత్ ప్రణాళిక, కార్యక్రమాలను గురించి చర్చించారు.
    .డెట్రాయిట్ బృంద సమన్వయకర్తగా కృష్ణ కొత్తపల్లి, డైరెక్టర్స్ గా శ్రీని కొడాలి, గౌతంరావు మార్నేని, శివ అడుసుమిల్లి, భాస్కర్ వారణాసి, శ్రీధర్ అట్లూరి, దత్త సిరిగిరి, కిషొర్ కొడాలి, కృష్ణమోహన నిచ్చనమెట్ల, శ్రీధర్ బండారు, వంశిధర్ రెడ్డి వినుకొండ, సుభాష్ రౌతు, కిషొర్ తమ్మినీడి నియమితులయ్యారు.

    నాట్స్ లోకి స్థానిక తెలుగు ప్రముఖులు

    జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తమ సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందుండే ముగ్గురు తెలుగు ప్రముఖులు నాట్స్ కుటుంబంలో సభ్యులగా చేరారు. వరంగల్ కు చెందిన శ్రీధర్ బండారు, నల్లొండ జిల్లాకు చెందిన సుభాష్ రౌతు (నల్గొండ), పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కిషొర్ తమ్మినీడి లు నాట్స్ డైరక్టర్లుగా తమ సేవలందించనున్నారు. ఇప్పటివరకు ఇటు డెట్రాయిట్ లోనూ అటుభారత దేశంలోనూ అనేక సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ముగ్గురు ప్రముఖుల నేపధ్యం, వారి అనుభవం, నాట్స్ కి మరింత ఉపయోగపడనుంది.

    డెట్రాయిట్ లో మరిన్ని కార్యక్రమాలు

    నాట్స్ ద్వారా డెట్రాయిట్ లో నివసిస్తున్న తెలుగు వారికి ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలి అన్న విషయం పైన కొత్త కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది.

    అమెరికాలొ పెరుగుతున్న తెలుగువారి జనాభాతొ పాటు వారి సామాజిక అవసరాలు కూడ త్వరితంగా మారుతున్న నేపధ్యంలొ, నాట్స్ సేవా కార్యక్రమాల పరిధిని కూడా విస్తృతంగా పెంచాలి అని ఈ సమావేశం నిర్ణయించింది.కొత్త సభ్యులకు నాట్స్ జాతీయ కార్యవర్గం తరపున నాట్స్ జాతీయ కార్యదర్శి బసవేంద్ర సూరపనేని, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ కొడాలి, అధ్యక్షులు గంగాధర్ దేసు, చైర్మన్ మధు కొర్రపాటి అభినందనలు తెలిపారు.