Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

 • Dallas Children’s Day Celebrations-Grand Success

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , డాలస్ విభాగం ప్రతీ సంవత్సరం ఎంతో వేడుకగా జరిపే బాలల దినోత్సవం ఈ నెల 22 వ తారీఖున ఫార్మర్స్ బ్రాంచ్ నగరం లోని సెయింట్ మేరీస్ చర్చి ఆడిటోరియం లో ఘనం గా జరిగాయి.

  మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై ఆరు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొని అనేక పోటీ కార్యక్రమాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. శాస్త్రీయ, సాధారణ సంగీతం, నృత్యం తో పాటు చదరంగం, తెలుగు పదజాలం ఇత్యాది రంగాలలో పదేళ్లలోపు, పదేళ్ళ పైబడిన వర్గాలలో ఈ పోటీలు నిర్వహించి ప్రతీ పోటీ లోను మొదటి మూడు స్థానాలు పొందినవారికి బహుమతులు అందజేసారు నిర్వాహకులు. భారత దేశం లో జరిగే చాచా నెహ్రు దినోత్సవాన్ని ఇక్కడి పిల్లలకు పరిచయం చేస్తూ మన దేశ ఔన్నత్యాన్ని, నాయకత్వ లక్షణాలను భావి తరాలకు అందించే విధంగా సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపిస్తూ కేవలం ప్రదర్సనలకే పరిమితం కాకుండా వారిలో ఆసక్తి, పోటీ తత్వాన్ని పెంపొందించేలా సాగడం ఎంతో ముదావహం.

   

  (Please add names of few senior people as well ) ఫాదర్స్ డే , మదర్స్ డే అంటూ జరిపే అమెరికన్ వాతావరణం లో పిల్లల కోసం బాలల సంబరాలు నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వక్తలు ప్రశంసించారు ఈ కార్యక్రమలో జరిగిన పోటీలు, విజేతల వివరాలు (మరింత విపులంగా ) : ఈ కార్యక్రం నిర్వహణ లో జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, వీణా యలమంచిలి, రాజేంద్ర మాదాల, బోర్డు అఫ్ డైరెక్టర్స్ విజయ్ వెలమూరి, శ్రీనివాస్ కోనేరు, శ్రీనివాస్ బావిరెడ్డి, డల్లాస్ చాప్టర్ కార్య నిర్వాహకులు శ్రీనివాస్ కావూరు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీలు మండిగ, చైతన్య కంచెర్ల, సురేంద్ర ధూల్లిపాళ్ళ, కృష్ణా వల్లపరెడ్డి, రామకృష్ణ మార్నేని, అపర్ణ వెలమూరి, అభి, రామకృష్ణ నిమ్మగడ్డ, అనంత్ మల్లవరపు, శ్రీనాథ్ జంధ్యాల, శిరీష బావిరెడ్డి, అజయ్ గోవాడ, రాజ్ గొంది, భాస్కర్ రాయవరం ఇతర కార్య వర్గ సభ్యులు తమ తోడ్పాటు అందించారు. స్థానిక బావర్చి ఫ్రిస్కో, సాఫ్ట్ స్కూల్స్.కాం, రెక్స్ ప్రోగ్రామింగ్ & హైదరాబాదీ హౌస్ ఈ కార్యక్రమణ నిర్వహణకు తమ సహాయాన్ని, యువ తెలుగు రేడియో, టీవీ 9, దేశిప్లాజా, రేడియో ఖుషి, 6 టీవీ, టీవీ 5 మీడియా సహకారాన్ని అందించారు. ఇంకా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరఫున విజయ్ మోహన్ కాకర్ల గారు, డాక్టర్ ఉరిమిండి నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

  ఈ కార్యక్రమం లో ఔత్సాహికులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించటమేగకుండా, ఇక్కడ నివసించే ప్రవాసాంధ్ర పిల్లల కొరకు నాట్స్ గత కొన్ని సంవత్సరాలు నుండి బాలల సంబరాలు కార్యక్రమం ద్వారా చేస్తున్న కృషిని ప్రశంసించారు.

  Winners List

  Competition Category Winner – 1st Prize Winner – 2nd Prize Winner – 3rd Prize Winner – 4th Prize Winner – 5th Prize
  Classical Singing – Geethams Varun Gunda Srinidhi Mahadevan Advaith Iyer    
  Classical Singing – Varnams Manasa Velamuri Aneesha Kandikonda Mytreyi Abburu
  Classical Singing – Keerthanas, Kruthis Sreeragini Ghantasala Samhita Bandaru Bharathi Caldwell
  Non Classical Singing Akhil Mulukutla Sreya Kodela Bharathi Caldwell
  Classical Dance (Grades 1-5) Sai Hiranya Akarapu Vyshnavi Poruri Revanth Kaja
  Classical Dance (Grades 6-10) Sreeragini Ghantasala Suman Vadlamudi Hamsika Mythili Gorty
  Non Classical Dance (Grades 6-10) Apoorva Balakavi    
  Telugu Vocabulary (Grades K-4) Himaja Tummuru Yashita Chunduru Nikhita Dasti
  Telugu Vocabulary (Grades 5-8) Tejaswini Tummuru Manasa Velamuri Sai Harshini Akarapu & Veda Velamuri
  Chess U400 (Grade K-3) Ashvath Jagtap Jaikirin Kumaravel Soham Kulkarni Deep Chokshi Saharsh Sai Kuditini
  Chess U600 (Grade K-12) Bharat Kalra Revant Kanakamdala Jeeya Desai Udit Tallam Adishri Eksambe
  Chess Open (Grade K-12) Gireesh Daggupati Abhinav Padala Aryan Eksambe Yash Vallapareddy Teja Sirigina