Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

President Message

Rajasekhar Allada

President, NATS

ప్రియమైన NATS కుటుంబ సభ్యులారా,
 
మీ అందరి ప్రేమ, నమ్మకం, ఆశీర్వాదాలతో 2026–2028 కి గాను, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగానూ, గౌరవప్రదంగానూ ఉంది.
 
నా NATS ప్రయాణం 2009లో ఒక వాలంటీర్‌గా మొదలైంది. మన తెలుగు సమాజానికి ఏదైనా చేయాలనే చిన్న ఆలోచనతో మొదలైన ఈ ప్రయాణం, సేవ పట్ల అంకితభావంగా మారింది. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన వాలంటీర్లు, నాయకులు, సభ్యులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి కృషివల్లే NATS ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయమైన తెలుగు సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
 
ఈ బాధ్యతను నాపై ఉంచిన NATS బోర్డు చైర్మన్ శ్రీ కిషోర్ కంచర్ల గారికి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు, సెలెక్షన్ కమిటీకి, మాజీ అధ్యక్షులకు, అలాగే ప్రతి సభ్యుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత నాయకులు నిర్మించిన బలమైన పునాదులను గౌరవిస్తూ, రాబోయే తరాలకు మరింత మంచి భవిష్యత్తు అందించే బాధ్యతగా దీనిని స్వీకరిస్తున్నాను.
 
NATS అనేది కేవలం ఒక సంస్థ కాదు; మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కలిసిన ఒక పెద్ద కుటుంబం. మన తెలుగు భాషను కాపాడటం, యువతను ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని మరింత దగ్గర చేయడం మన లక్ష్యంగా కొనసాగుతుంది.
 
మన వారసత్వాన్ని నిలుపుపుకోవడమే కాదు, దానిపట్ల గర్వపడేలా తదుపరి తరాన్ని ప్రేరేపించడం కూడా చాలా ముఖ్యం. విద్య, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు నాయకత్వంలోనూ, సేవా కార్యక్రమాలలోనూ కొత్త అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాము.
 
NATS అసలు బలం మన వాలంటీర్లే. ప్రతి కార్యక్రమం, ప్రతి సహాయం, ప్రతి విద్యార్థికి అందించిన మద్దతు, ప్రతి సంస్కృతిక విలువ పరిరక్షణ వెనుక వారి నిస్వార్థ సేవే ఉంది.
 
అధ్యక్షుడిగా నేను నిజాయితీతో, పారదర్శకతతో, అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వంతో, సేవా భావంతో పనిచేస్తానని మాటిస్తున్నాను. ణాట్శ్ బోర్డు చైర్మన్ శ్రీ కిషోర్ కంచర్ల గారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతాను. రాబోయే రెండేళ్లను విజయవంతంగా నడిపించడం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు గర్వంగా భావించే ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మించడమే నా లక్ష్యం.
 
పెద్ద విజయాలు ఒక్క వ్యక్తి వల్ల రావు. ఒకే లక్ష్యంతో మొత్తం సమాజం కలిసి పనిచేసినప్పుడు అవి సాధ్యమవుతాయి. అందుకే ప్రతి సభ్యుడు, వాలంటీర్, యువ నాయకుడు, దాత, మద్దతుదారుడు NATS తదుపరి అధ్యాయాన్ని నిర్మించే ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
 
మన తెలుగు భాష మరింత వికసించాలి, మన సంస్కృతి మరింత వెలుగొందాలి, మన యువత తమ మూలాలతో అనుబంధంగా ఉండాలి, ణాట్శ్ సేవకు మరియు తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా తరతరాలు వర్ధిల్లాలి. 
 
పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారార్థమిదం శరీరం
 
"చెట్లు ఇతరులకు ఉపయోగపడటానికే ఫలాలు ఇస్తాయి. నదులు ఇతరుల మేలు కోసమే ప్రవహిస్తాయి.
ఆవులు ఇతరుల కోసం పాలు ఇస్తాయి. అలాగే ఈ మనిషి శరీరం కూడా పరులకు ఉపకారం చేయడానికే ఉద్దేశించబడింది"
 
మీ నమ్మకానికి, మద్దతుకు, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
 
వినమ్ర హృదయంతో,
 
•⁠  ⁠రాజ్ అల్లాడ
 
 
Dear NATS Family,
 
With profound gratitude and humility, I accept the responsibility of serving as President of the North America Telugu Society (NATS) for the 2026–2028 term.
 
My journey with NATS began in 2009 as a volunteer. What started as a simple desire to give back to our community evolved into a lifelong commitment to service. Over the years, I have been blessed to work alongside extraordinary volunteers, dedicated leaders, and passionate members who have transformed NATS into one of the most respected Telugu organizations in the world.
 
I extend my heartfelt thanks to NATS Board Chairman Sri Kishore Kancharla, the Board of Directors, the Selection Committee, our past presidents, and every member who has entrusted me with this honor. I accept this responsibility with deep respect for the legacy built by those who came before us and with unwavering commitment to the generations that will follow.
 
NATS is more than an organization—it is a family united by our language, culture, traditions, and shared values. As we move forward, our mission remains clear: to serve our community with compassion, preserve and promote the Telugu language, empower our youth, support those in need, and strengthen the bonds that connect Telugu people across North America and around the world.
 
The future of NATS lies not only in celebrating our heritage but also in inspiring the next generation to embrace it with pride. Together, we will expand our educational, charitable, cultural and community initiatives while creating new opportunities for leadership, innovation, and service.
 
I firmly believe that the true strength of NATS comes from its volunteers. Every event organized, every family helped, every student supported, and every cultural tradition preserved is the result of countless individuals working selflessly for a greater cause.
 
As your President, I pledge to lead with integrity, transparency, inclusiveness and a spirit of service, under the guidance of Sri Kishore Kancharla. My goal is not merely to guide NATS through the next two years, but to help build a legacy that future generations will proudly inherit a legacy defined by service, unity, cultural pride and meaningful impact.
 
The greatest achievements are never accomplished by one individual; they are accomplished when an entire community comes together with a shared vision. I invite every member, volunteer, youth leader, donor, and supporter to join us in shaping the next chapter of NATS.
 
Let us work together to ensure that our Telugu language flourishes, our culture remains vibrant, our youth remain connected to their roots, and NATS continues to be a beacon of service and pride for generations to come.
 
పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారార్థమిదం శరీరం
 
Trees bear fruit for the benefit of others. Rivers flow for the benefit of others. Cows give milk for the benefit of others. Likewise, this human body is meant to serve and help others.
 
Thank you for your trust, your support and your partnership in this journey.
 
With warm regards,
 
•⁠  ⁠Raj A